Helpline-1098 | తిమ్మాపూర్, డిసెంబర్2: తిమ్మాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో స్నేహిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ తానాజీ వాఖాడే హాజరయ్యారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ 1098 కు భయం లేకుండా కాల్ చేయాలని సూచించారు.
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఉత్సాహ పరిచారు. జాతీయస్థాయి కళోత్సవాలకు పాల్గొన్న విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, ఇన్చార్జ్ సీడీపీఓ శ్రీలత, పాఠశాల ఎస్వో పడాల కిరణ్ జ్యోతి, కాచగాని మధులత, వైద్యురాలు డాక్టర్ జవేరియా, అధికారులు అర్చన రమేష్ తదితరులు పాల్గొన్నారు.