మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే డిపార్ట్మెంట్లో జేఈఈగా పనిచేస్తున్న భగవత్ అనే వ్యక్తి లారీని వెనుక నుంచి ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేపట్టారు.
కాగా, ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం కిష్టాపురం వద్ద అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మృతులను సిద్దేశీజాయ్ (18), సాదిక్ (16), శశి (12)గా గుర్తించారు. చంద్రుగొండ నుంచి సత్తుపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.