Gambling | సిర్గాపూర్, అక్టోబర్ 04 : దీపావళి పండుగ ఉందని గ్రామాల్లో పేకాట ఆడితే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడైనా పేకాట ఆడితే ఆ స్థలం యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. పేకాట వల్ల వచ్చేది ఏమీ ఉండదని, అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దన్నారు.
తాగుడుకు బానిసై చివరికి అప్పులు చేసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పారు. పేకాట ఆడితే సమాచారం ఇవ్వాలని సిర్గాపూర్, కల్హేర్, కంగ్టి మండలాల ప్రజలకు సీఐ వెంకట్ రెడ్డి సూచించారు.
HYDRAA | రేవంత్ రెడ్డి పక్కా దొంగనే.. నిప్పులు చెరిగిన హైడ్రా బాధితురాలు
Man Shoots Friend | ఫ్రెండ్ను కాల్చి చంపిన వ్యక్తి.. రికార్డ్ చేసిన వీడియో వైరల్