Gas Shortage | తప్పని గ్యాస్ కష్టాలు.. ఇక కట్టెల పొయ్యే శరణ్యమా..?
Gas Shortage | జహీరాబాద్ పట్టణంలోని రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్, వీధుల్లో తోపుడు బళ్లపై బజ్జీలు, పకోడీలు విక్రయిస్తూ చాలామంది ఉపాధి పొందుతున్నారు. కాగా ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో చాలా మంది నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.
Gas Shortage | జహీరాబాద్, మార్చి 19 : పశ్చిమాసియా యుద్ధం ప్రభావం.. పరోక్షంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పడింది. ఓవైపు గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సిలిండర్లు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా వాణిజ్య సిలిండర్ల సరఫరాను ఆయా కంపెనీలు నిలిపివేయడంతో హోటల్స్ నిర్వాహకులకు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ కష్టాల నుంచి గట్టేక్కెందుకు కొందరు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ.. హోటళ్ల నిర్వహణ సాగిస్తున్నారు. మరికొందరు పాతపద్ధతిలో ఊకపొయ్యిలను వినియోగిస్తున్నారు. కట్టెలు, ఊక సక్రమంగా దొరక్క హోటళ్ల నిర్వహణ కష్టమవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జహీరాబాద్ పట్టణంలోని రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్, వీధుల్లో తోపుడు బళ్లపై బజ్జీలు, పకోడీలు విక్రయిస్తూ చాలామంది ఉపాధి పొందుతున్నారు. కాగా ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో చాలా మంది నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే హోటల్స్‌లో గృహావసర గ్యాస్ సిలిండర్ల (డొమెస్టిక్) వినియోగం లేకుండా అధికారులు ముమ్మర దాడులు చేస్తున్నారు. దీంతో గత రెండు రోజుల్లో అనేక ప్రాంతాల్లో చిన్నచిన్న హోటళ్లు మూతపడ్డాయి. వివాహాలతోపాటు శుభకార్యాల సీజన్ కావడంతో గ్యాస్ కొరతతో నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు.
నిబంధనలు కఠినతరం చేసిన కంపెనీలు..
మరికొద్దిరోజులపాటు యుద్ధం కొనసాగి గ్యాస్ సరఫరా మరింత కష్టమైతే మాత్రం హోటళ్లు, టిఫిన్ సెంటర్ల మూతవేయడం తప్పదని చెబుతున్నారు. గృహావసర వినియోగదారులకు కూడా గ్యాస్ సిలిండర్లు సకాలంలో సరఫరా కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో బుక్ చేసుకున్న రెండు రోజులకే సిలిండర్ అందజేసేవారు. ప్రస్తుతం కంపెనీలు నిబంధనలు కఠినతరం చేశాయి. దీంతో పట్టణాల్లో 25 రోజుల తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత గ్యాస్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్నారు. ఎక్కడికక్కడే కట్టెలు, బొగ్గు ఆధారిత పొయ్యిలు దర్శనమిస్తున్నాయి. కరెంట్ స్టౌలనూ విరివిగా వాడుతున్నారు.
వరుసగా పండుగలు రావడంతో గ్యాస్ సిలిండర్లు లభించకపోవడంతో వినియోదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. బ్లాక్‌లో రూ.1500 నుంచి 1600 వరకు కొనుగోలు చేసుకుంటున్నారు. గ్యాస్ కొరతతో వంట కలపకు డిమాండ్ ఏర్పడింది. వాటి ధర కూడా అమాంతం పెరిగింది. గతంలో వంట కలప క్వింటాల్ రూ.200 నుంచి రూ.300 ఉండగా.. ప్రస్తుతం రూ.500 వరకు చేరింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వంట చెరకును దిగుమతి చేసుకుంటున్నారు. కాగా పట్టణాల్లో వంట కలప కొరత కారణంగా కూడా కొన్ని హోటళ్లు మూతపడుతున్నాయి. హోటల్లో పనిచేసే సిబ్బంది పని లేక ఇబ్బందులకు గురవుతున్నారు.

Gas Shortage 1
Read Also :
PM Modi | తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, గవర్నర్
Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రివ్యూ.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎలా ఉంది.!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

