హైదరాబాద్ : తెలంగాణ భవన్లో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు భవన్లో పూజా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు.
పూజా కార్యక్రమం ముగిసిన వెంటనే పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. పండితులు పంచాంగ పఠనం చేస్తుంటే కేటీఆర్‌తోపాటు ఇతర నాయకులు అందరూ విన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఉగాది వేడుకలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. pic.twitter.com/aEbCocly3R
— BRS Party (@BRSparty) March 19, 2026
తెలంగాణ భవన్లో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు… pic.twitter.com/zgpuYtfglm
— BRS Party (@BRSparty) March 19, 2026