Drones | అమెరికా కీలక నేతల నివాసాలపై డ్రోన్ల కలకలం.. అప్రమత్తమైన అగ్ర రాజ్యం
Drones | అమెరికా సర్కారు (US Govt) లో కీలక బాధ్యతలు నిర్వహించే ఇద్దరు నేతల నివాసాలపై డ్రోన్లు (Drones) సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio), రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ల నివాసాల పరిసరాల్లో ఈ డ్రోన్లు కనిపించడంతో అమెరికా నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఈ పరిణామంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది.
Drones : అమెరికా సర్కారు (US Govt) లో కీలక బాధ్యతలు నిర్వహించే ఇద్దరు నేతల నివాసాలపై డ్రోన్లు (Drones) సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio), రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ల నివాసాల పరిసరాల్లో ఈ డ్రోన్లు కనిపించడంతో అమెరికా నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఈ పరిణామంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది.
వర్జీనియాలోని లాంగ్లీ ఎయిర్ ఫోర్స్ బేస్ వంటి అత్యంత కీలకమైన సైనిక స్థావరాల వద్ద గత కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. సుమారు 20 డ్రోన్లు గుంపులుగా ఏర్పడి, తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డ్రోన్లను ఎవరు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనేది అధికారులకు అంతుచిక్కడం లేదు. ఇవి సాధారణ వాణిజ్య డ్రోన్ల కంటే చాలా వేగంగా ప్రయాణిస్తుండటంతో వాటిని అడ్డుకోవడం సవాలుగా మారింది.
ఈ ఘటనలపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగరేషన్ (FBI), పెంటగాన్ ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించాయి. కీలక నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు ఇరాన్ లేదా ఇతర విదేశీ శక్తులు ఈ డ్రోన్లను ప్రయోగిస్తున్నాయా..? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రమైన వేళ అమెరికా గడ్డపైనే ఇలాంటి నిఘా నీడలు కమ్ముకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం నిఘా కోసమా..? లేదంటే భవిష్యత్తులో ఏదైనా దాడికి సంబంధించిన సన్నాహక చర్యనా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- drones
- Hegseth
- Rubio
- US key leaders
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

