Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Iran Warning | సౌదీ అరేబియా (Saudi Arabia), టర్కీ (Turkey) లతో కలిసి పాకిస్థాన్ (Pakistan) ఏర్పాటుచేసిన రక్షణ ఒప్పందం కార్యాచరణలోకి రావడంపై ఇరాన్ (Iran) తీవ్ర స్వరంతో స్పందించింది. యెమెన్ (Yemen) విషయంలో జోక్యం చేసుకుంటే ఆ ప్రాంతంపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరించింది.
Iran Warning : సౌదీ అరేబియా (Saudi Arabia), టర్కీ (Turkey) లతో కలిసి పాకిస్థాన్ (Pakistan) ఏర్పాటుచేసిన రక్షణ ఒప్పందం కార్యాచరణలోకి రావడంపై ఇరాన్ (Iran) తీవ్ర స్వరంతో స్పందించింది. యెమెన్ (Yemen) విషయంలో జోక్యం చేసుకుంటే ఆ ప్రాంతంపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరించింది. ముఖ్యంగా అమెరికాతో చర్చల విషయంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ ఈ కూటమిలో చేరడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది.
ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం ప్రకారం.. సౌదీ మౌలిక సదుపాయాలపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడులు పెరగడంతో ఈ త్రైపాక్షిక ఒప్పందం అక్టోబర్ 5 నుంచి కార్యాచరణ దశలోకి వచ్చింది. సౌదీ అరేబియాకు మద్దతుగా టర్కీ, పాకిస్థాన్ చర్యలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది పాకిస్థాన్ సైనికులను సౌదీకి పంపవచ్చనే వార్తలపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పందించారు.
ఈ నేపథ్యంలో యెమెన్ విషయంలో ఏ దేశం జోక్యం చేసుకున్నా ఆ ప్రాంతంలో అవాంఛనీయ పరిణామాలు తప్పవని బఘాయీ స్పష్టంచేశారు. అయితే టర్కీ కంటే పాకిస్థాన్‌పైనే ఇరాన్ తన విమర్శలను ఎక్కువగా కేంద్రీకరించింది. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య మధ్యవర్తిగా ఇస్లామాబాద్ పోషిస్తున్న ప్రముఖ పాత్రే ఇందుకు కారణం. ఇదిలావుంటే ఇరాన్‌లోని పలువురు చట్టసభ సభ్యులు ఈ ఒప్పందాన్ని ఓ కాగితపు ఒప్పందంగా కొట్టిపారేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

