CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
CJP Leaders : తమ సీజేపీ నేతల్ని అరెస్టు చేయడం ద్వారా మోదీ సర్కారు భయానక వాతావరణాన్ని సృష్టించాలనుకుంటోందని విమర్శించారు. తమ వారిని అడ్డుకోవడం వల్ల దేశ ప్రతిష్ట మసకబారుతుందన్నారు.
CJP Leaders : కేంద్ర ప్రభుత్వం దేశంలో పౌరులపై యుద్ధం చేస్తోందని, ప్రస్తుత పరిస్తితి బహిరంగ ఎమర్జెన్సీని తలపిస్తుందని సీజేపీ నేతలు ఆరోపించారు. కోర్టు ఆదేశాలతో అరెస్టు నుంచి విడుదలైన అనంతరం ఆదివారం మీడియాతో మాట్లాడారు. సీజేపీ అగ్రనేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ మీడియా సమావేశంలో పాల్గొని కేంద్రం ప్రభుత్వంతోపాటు, పోలీసులపై ఆరోపణలు చేశారు. అక్టోబర్ 10, శనివారం చేపట్టాల్సి ఉన్న సీజేపీ నిరసనను కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.
సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే సహా అగ్రనేతల్ని అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టు ఆదేశాల అనంతరం విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో సీజేపీ నేతలు ఢిల్లీలో ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లు మోదీ సర్కార్ తీరుపై విమర్శలు చేశారు. తమ సీజేపీ నేతల్ని అరెస్టు చేయడం ద్వారా మోదీ సర్కారు భయానక వాతావరణాన్ని సృష్టించాలనుకుంటోందని విమర్శించారు. తమ వారిని అడ్డుకోవడం వల్ల దేశ ప్రతిష్ట మసకబారుతుందన్నారు. ‘‘సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఆందోళనను ప్రభుత్వం మోదీ, అమిత్ షాపై తిరుగుబాటులా మార్చింది. ప్రభుత్వం పౌరులపై యుద్ధం చేస్తోంది. ఇది ఓపెన్ ఎమర్జెన్సీని తలపిస్తోంది.
బంగ్లా సాహిబ్ గురుద్వారాలోకి పోలీసులు బూట్లతో ప్రవేశించారు. అది కూడా తలపాగా లేకుండా. మా ఉద్యమానికి సిక్కులు మద్దతు ఇవ్వాలి. విమానంలోనే మమ్మల్ని అరెస్టు చేశారు. ఎలాంటి పత్రాలు చూపకుండానే మమ్మల్ని నిర్బంధించారు. ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కనీసం, న్యాయ సహాయం పొందే వీలు కూడా లేకుండా చేశారు. మోదీ అత్యంత పిరికి ప్రధాని. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు, దిగ్బంధనాలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి. ఎన్నికల సంఘం మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది’’ అని రాంకా ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

