truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
truck rams Durga idol procession | దసరా నవరాత్రుల నేపథ్యంలో దుర్గా దేవి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న వారిపైకి ఒక లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
బెంగళూరు: దసరా నవరాత్రుల నేపథ్యంలో దుర్గా దేవి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న వారిపైకి ఒక లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. (truck rams Durga idol procession) కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెళగావి నుంచి దుర్గా మాతా విగ్రహాంతో కొందరు భక్తులు ఊరేగింపుగా హుంచ్యనట్టి గ్రామానికి వాహనంలో తీసుకెళ్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున హుక్కేరి తాలూకాలో ఉన్న హత్తరగి టోల్ ప్లాజా సమీపంలో ఒక లారీ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మృతులను ప్రకాష్, మహేష్, దనేశ్వరిగా గుర్తించారు. గాయపడిన వారిని బెళగావి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (బిమ్స్)తో పాటు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

