PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
PM Modi : తమిళనాడులో ప్రభుత్వం మారినప్పటికీ ఆ రాష్ట్రంపై తన నిబద్ధత మారదని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాదు.. తమిళనాడు సీఎం విజయ్‌తో కలిసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం అన్నారు.
PM Modi : తమిళనాడులో ప్రభుత్వం మారినప్పటికీ ఆ రాష్ట్రంపై తన నిబద్ధత మారదని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాదు.. తమిళనాడు సీఎం విజయ్‌తో కలిసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం అన్నారు. చెన్నైలో పూనమల్లి-వడపళని మార్గంలోని మెట్రో రైలును సీఎం విజయ్‌తో కలిసి ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రూ.13,000 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాని ప్రసంగం చేశారు.
‘‘ఈరోజు తమిళనాడు చరిత్రలో చారిత్రాత్మక రోజు. రవాణా, పరిశ్రమలు, వ్యాపారం, నిర్మాణం వంటి రంగాల్లో రూ.13,000 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించాం. కొన్ని పనులను ప్రారంభించగా.. ఇంకొన్నింటికి శంకుస్థాపనలు చేశాం. తాము చేపడుతున్న అభివృద్ధి పనులు తమిళనాడు యువతకు పలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడి సీఎంలు కరుణానిధి, జయలలిత వంటి వారితో కలిసి పని చేశా. అలాగే, ప్రధానిగా ఉన్న సమయంలో జయలలిత, పన్నీర్ సెల్వం, పళనిస్వామి, ఎంకే స్టాలిన్‌లతో కూడా పని చేశా.
ప్రభుత్వాలు మారాయి. కానీ, తమిళనాడు అభివృద్ధి, ఇక్కడి ప్రజలకు సేవ చేసే విషయంలో నా దృక్పథం మాత్రం మారలేదు. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారి ఆలోచనలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయో ఆలోచించా. అందుకే ప్రధాని అయిన తర్వాత వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రతి రాష్ట్రం తమ సొంత లక్ష్యాలను సాధించుకోవాలి’’ అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం విజయ్‌తోపాటు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కూడా పాల్గొన్నారు. మెట్రో రైలులో ప్రయాణించిన సందర్బంగా మోదీ రైలు టిక్కెట్ కొనుగోలు చేయడం విశేషం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

