Mettu Kumar Yadav | పటాన్ చెరు, జూన్ 14: వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం పటాన్ చెరు డివిజన్ పరిధిలో ఉన్న అంబేద్కర్ కాలనీలో పర్యటించి డ్రైనేజీ సమస్యను తెలుసుకున్నారు.
కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పలు చోట్ల నాలా జామ్ కావడం జరుగుతుందని ఈ సందర్భంగా కాలనీవాసులు తెలిపారు. నాలాలో చెత్త పెరిగిపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి సమీక్ష చేస్తానన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
భారీ వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మురికి కాలువల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు.
Read Also :
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్