MLA Mahipal Reddy | పటాన్చెరు, అక్టోబర్ 13 : రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా పటాన్చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా ఈ నెల 16 నుండి 18 తేదీ వరకు జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్, కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీల ఏర్పాట్లను పరిశీలించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా టీం అండర్ 14, అండర్ 17 కబడ్డీ బాలుర బాలికల ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలకు ఆతిథ్యం అందిస్తున్నామని తెలిపారు.
33 జిల్లాల నుండి 400 మంది క్రీడాకారులు, 60 మంది కోచులు, 160 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఈ క్రీడోత్సవాలలో పాల్గొనబోతున్నారని తెలిపారు. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా వాలీబాల్ కబడ్డీ అంశాలలో ఈ పోటీలు జరగనున్నాయని తెలిపారు. 40 లక్షల రూపాయలు సొంత నిధులతో క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులతోపాటు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, సీఐ వినాయక రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, గౌసుద్దిన్, ఎల్లయ్య, ప్రమోద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Bihar Election | అభ్యర్థులను ఖరారు చేసిన జేడీయూ.. నాలుగు స్థానాలలో సిట్టింగ్లకు ఉద్వాసన..!
Explosives In Bag | వదిలేసిన బ్యాగులో పేలుడు పదార్థాలు.. బాంబ్బ్లాస్ట్కు కుట్రగా అనుమానం
Narnoor | మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు : ఎస్ఐ అఖిల్