Fire Accident | హత్నూర, నవంబర్ 9 : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల శివారులోని ఏపీటోరియా యూనిట్-1 పరిశ్రమలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంబవించినట్లు స్థానికులు తెలిపారు. పరిశ్రమలో ఈపీటీ బ్లాక్ వద్ద రసాయన పదార్థాలు శుద్ధిచేసే క్రమంలో ఒక్కసారిగా స్పార్క్ లా వచ్చి మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో పైభాగంలోని పైకప్పుకు నిప్పంటుకొని భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ క్రమంలో ఒక్కసారిగా పరిశ్రమలోని కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే పరిశ్రమ యాజమాన్యం అప్రమత్తమై వెంటనే మంటలను ఆదుపు చేసినట్టు పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రమాదంలో పరిశ్రమలోని పలు పరికరాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
కాగా తరచూ పరిశ్రమలలో ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో స్థానికులు, కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపించారు.
Anandhi | నేను ఓరుగల్లు పిల్లని.. పుట్టింది, పెరిగింది అంతా వరంగల్లోనే!
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం
Tornado | టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి.. 800 మందికి గాయాలు