Onion Cultivation | మనూరు, జూలై 05 : సమీకృత అభివృద్ధి మిషన్ పథకం ద్వారా ఉల్లి సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుందని.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని ఉద్యానవన శాఖ అధికారిణి మౌనిక రెడ్డి అన్నారు. శనివారం రాణాపూర్, తుమ్నూర్లో ఉల్లి సాగు చేసే రైతులకు తుమ్నూర్ గ్రామ పంచాయతీలో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉల్లి సాగు కోసం ఎకానికి రూ.8000 చొప్పున సబ్సిడీ అందించనుందని అన్నారు. అదేవిధంగా పండ్ల తోటల నిర్వహణకుగాను కూరగాయల సాగుకు వివిధ రకాల వాటికి సబ్సిడీ అందించడం జరుగుతుందని అన్నారు. ఆయిల్ పామ్ పంట పండించే రైతులకు ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే గోద్రేజ్ ఆగ్రోవేట్ సంస్థ పంట కొనుగోలు చేస్తుందని అన్నారు.
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.50,918 రాయితీ రూపంలో ఇస్తుందని అన్నారు. పంటల మార్పిడిలో భాగంగా ఉద్యాన వన పంటల సాగును పెంచాలని, దీని ద్వారా రైతులకు అధిక లాభాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నూతన్ కుమార్, మండల వ్యవసాయ అధికారి మహేష్ చౌహన్, ఏఈఓ సంధ్యా, మాజీ సర్పంచ్ బ్రహ్మానందరెడ్డి, రైతులు విష్ణువర్ధన్‌రెడ్డి, బషన్న, లక్ష్మన్న, సుభాష్‌రావు, పండరినాథ్‌రావు, రాజు పాల్గొన్నారు.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు