Electricity Officials | మనూరు, మార్చి 08 : రైతుల సమస్యలు పరిష్కారించడంలో విద్యుత్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. విద్యుత్ తీగలు పంటపొలాల్లో చేతికి అందేమాదిరిగా తయారైనా ఏమాత్రం పట్టించుకోవడం లేదని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. చేతికందే వైర్లు, చెట్ల కొమ్మలు, కర్రల సహాయంతో విద్యుత్ తీగలు పలు రకాల సమస్యలతో రైతులు పలు మార్లు అధికారులకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు.
కరెంటు సరఫరా నిరంతరంగా అందించాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు శాపంగా మారింది. మనూరు మండల పరిధిలో పలు గ్రామాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగి పోతుండడంతో కరెంటు సమస్యలు మరింత తీవ్రంగా మారే ఆస్కారం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. పంట పొలాల్లో వంగిన స్థంబాలు సరి చేయాలని పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెల్లినా ఫలితాలు లేకుండా పోయాయని.. పలు గ్రామాల రైతులు వాపోతున్నారు. దీంతో చిన్న పాటి గాలి వచ్చిన విద్యుత్ తీగలకు మంటల చెలరేగి కరెంటు అంతరాయాలు ఏర్పాడుతున్నాయని రైతుల పేర్కొంటున్నారు.
ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు తగ్గడం రైతులకు ఒక సమస్య.. ఐతే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు అంతరాయం మరోవైపు అన్నట్టుగా తయారైంది. కరెంటు సరఫరా సక్రమంగా లేకపోతే మునుముందు మరింత ఇబ్బందులు తప్పేలా లేనట్టేనని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సమ్యలు పరిష్కరించి కరెంటుకు అంతరాయం లేకుండా చూడాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్