Jillella Villagers | సిరిసిల్ల రూరల్, మార్చి 8: బీఆర్ఎస్ సీనియర్ నేత, జిల్లెళ్ల మాజీ సర్పంచ్ మాట్ల మధుపై కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని జిల్లెల్ల యువకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల క్రాసింగ్‌లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతల ఆరోపణలపై నిరసన తెలిపారు.
అనంతరం యువకులు మాట్లాడుతూ.. నిరుపేదల వైద్యం కోసం అన్ని తానై హాస్పటల్‌కు తీసుకుపోయి వారికి అన్నివేళలా అండగా ఉన్న వ్యక్తి మధు అంటూ పేర్కొన్నారు. దారి ఖర్చులు సైతం తానే భరించి హాస్పటల్‌కు తీసుకెళ్ళి బాసటగా నిలుస్తాడని తెలిపారు. డాక్టర్ల దగ్గర కమీషన్లు తీసుకుంటాడని కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదన్నారు.
దమ్ము, ధైర్యం ఉంటే జిల్లెల్ల అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి నిరూపించాలనీ హెచ్చరించారు. తమ గ్రామంలో పెద్ద చెరువు, పెచ్చేరువు, బచ్చేరువు ఎక్కడుందో తెల్వని మీరు మా గ్రామం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
మధు అనే వ్యక్తి భూములను కబ్జా చేసి పట్టాలు చేసుకున్నాడని మీరు మాట్లాడం అవాస్తమన్నారు.
పది మందికి సహాయం చేసిండు.. కానీ ఎవ్వరికీ అన్యాయం చేయని వ్యక్తి మధు అనీ పేర్కొన్నారు. మధుపైఆరోపణలన్నీ అవాస్తవమని, తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఏం తెల్వకున్న పిచ్చిపిచ్చి పనులకు పూనుకుంటుండు అంటూ ఆరోపించారు. దళిత భూములను కబ్జా చేసి అన్ని విషయాల్లో తలదూర్చి ఆగం జేస్తున్నాడనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గ్రామంలోనే ఆ డైరెక్టర్‌కు సరైన సమయంలో సరైన గుణపాఠం తప్పక చెప్పుతమని హెచ్చరించారు.
నైతిక విలువలు మీకు లేవు..
మాట్ల మధు గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు…మరోసారి అనవసర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇట్టిరెడ్డి మహిపాల్ రెడ్డి,బోల్గం,రమేష్,ఎర్ర సుమన్,బండి శ్రీనివాస్, చింతమడక శంకర్, సయ్యద్ అఫ్రోజ్ ,గొట్టం వంశీ, దాసరి వంశీ, బర్ల రాజు, పర్వతం రాజు, ఉడుతల అక్షయ్, కనకలా అజయ్ పాల్గొన్నారు.