Chalo Warangal | కొండాపూర్, ఏప్రిల్26 : ఊరూవాడా ఓరుగల్లు బాట.. పట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ బీభత్సమైన కార్యచరణను రూపొందించిన విషయం తెలిసిందే. నేటి రజతోత్సవ మహాసభను సక్సెస్ చేసేందుకు కొండాపూర్ మండలంలోని ప్రతీ పల్లే కదిలేందుకు సిద్ధమైంది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కొండాపూర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ప్రతీ పల్లే నుంచి భారి నుంచి అతి భారీగా తరలివేల్లేందుకు ప్రతి కార్యకర్త భలే ఖుషి ఖుషీగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు మురిసిపోయేలా ఈ సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి గులాబి జెండానే శ్రీరామ రక్ష అని ప్రజలకు ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో పదేండ్లపాటు రాష్ట్రాభివృద్దిలో దూసుకుపోయిందని మండలంలోని సాధారణ ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణలో పార్టీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికి పార్టీ అండదండగా ఉంటుంది. వరంగల్ రజతోత్సవ సభకు కొండాపూర్ మండలంలో గత కొన్ని రోజులుగా వాల్ పోస్టర్లను అంటించే కార్యక్రమంలో ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్త బిజీగా ఉండిపోయారు.
వరంగల్లో జరుగనున్న పార్టీ రజతోత్సవ మహాసభకు కొండాపూర్ మండలం నుంచి అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లి సభను సక్సెస్ చేసేందుకు నేడు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని కొండాపూర్ మండల ప్రజలు కోరుతున్నారు. తెలంగాణకు మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ను ప్రజలు కోరుకుంటున్నారని తెలుపుతున్నారు. నేటి కార్యక్రమంతో తెలంగాణలో ఒక ఊపు.. ఊపనుందని మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Palvancha : కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటున్న తెలంగాణ సమాజం : మాజీ మంత్రి వనమా
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్పేటలో ముందే మురిసిన గులాబీ జెండా