CPM | పటాన్ చెరు, నవంబర్ 8 : పటాన్ చెరు నుండి ఇంద్రేశం మీదుగా వెళ్లే దౌల్తాబాద్ ఆర్అండ్బీ రోడ్డును విస్తరణ చేసి, గుంతలుగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని.. డివైడర్ ఏర్పాటు చేసి సెంటర్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం ఆధ్వర్యంలో ఇంద్రేశం దర్గా వద్ద నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు.
శనివారం పటాన్ చెరు మండలంలోని ఇంద్రేశంలో సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు వాజిద్ అలీ, పాండురంగారెడ్డి పూలమాలలు వేసి నిరాహార దీక్షను ప్రారంభించారు. సీపీఎం పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి బీ నాగేశ్వరరావు, ఏరియా కమిటీ సభ్యులు పాండురంగారెడ్డి, వాజిద్ అలీ మాట్లాడుతూ.. ఇంద్రేశం మున్సిపల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు.
ఎటు వెళ్లాలో తెలియడం లేదు..
భారీ వర్షాలకు పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణం చేసే వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియడం లేదని అన్నారు. మొన్న కురిసిన భారీ వర్షాల సందర్భంగా ప్రమాదాలు జరిగాయని, చేతులు, కాళ్లు విరిగిన సంఘటనలు ఉన్నాయన్నారు. మరమ్మత్తుల కోసం రూ.80 లక్షలు మంజూరైన ఎందుకు పనులు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. ఇంద్రేశం ప్రాంతం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మౌళిక సదుపాయాలను కల్పించడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం అవుతుందని అన్నారు.
కాలనీలు, అపార్ట్మెంట్లు, విల్లాలతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. భారీ నుంచి అతి భారీ వాహనాలు అధికలోడును తీసుకెళుతూ రోడ్లను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఈ రోడ్డు మీద ప్రజానీకం ప్రయాణం చేయాలంటే భయాందోళనకు గురవుతున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు సమస్యను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక ఆందోళన కార్యక్రమాలు మెమోరండాలు, పాదయాత్ర, నిరాహార దీక్ష కార్యక్రమాలు అనేకం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇంద్రేశం మున్సిపల్ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం సమస్యను దృష్టిలో ఉంచుకొని వెంటనే మరమ్మతులు చేపట్టి, విస్తరణ కార్యక్రమాలు ప్రారంభించాలని.. డివైడర్ ఏర్పాటు చేసి సెంటర్ లైటింగ్ సిస్టం వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
K Ramp Movie | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Rajinikanth | 50 ఏళ్ల సినీ కెరీర్.. రజనీకాంత్‌ను సన్మానించనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్
Ajay Bhupathi | ‘మంగళవారం’ దర్శకుడి కొత్త ప్రాజెక్ట్.. అనౌన్స్మెంట్ రేపే.!