Ajay Bhupathi | ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’… చేసింది మూడు సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకులలో అజయ్ భూపతి ఒకరు. మొదటి సినిమా ‘ఆర్ఎక్స్ 100’తో సూపర్ హిట్ కొట్టి అంచనాలు పెంచిన అజయ్, ఆ తర్వాత ‘మహాసముద్రం’తో నిరాశపరిచాడు. అయితే, రీసెంట్గా ‘మంగళవారం’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చి, తన ఖాతాలో మరో క్రేజీ హిట్‌ను వేసుకున్నారు. అయితే ‘మంగళవారం’ విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ, అజయ్ భూపతి తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు. దీంతో ఆయన తర్వాతి సినిమా ఏంటనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే, చాలా రోజుల తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్లు అజయ్ భూపతి ప్రకటించారు.
ఆయన నాల్గవ చిత్రానికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్‌కు ‘A4’ అనే వర్కింగ్ టైటిల్‌ను సూచించారు. ఈ ‘A4’ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను ఆదివారం ఉదయం 10:04 గంటలకు అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఆయన సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా వెల్లడించారు. ‘మంగళవారం’ వంటి థ్రిల్లర్‌తో ఆకట్టుకున్న అజయ్ భూపతి ఈసారి ఎలాంటి కథను ఎంచుకున్నారు అనే విషయంపై సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
New Story ❤️🔥
New Madness 🤩
New Experience 🔥#AB4 Announcement Tomorrow at 10:08 AM 💥 pic.twitter.com/fOPWwCbkRd— Ajay Bhupathi (@DirAjayBhupathi) November 8, 2025