K Ramp Movie | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘కే ర్యాంప్’ (K-Ramp) ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుని మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే థియేటర్లో మంచి విజయం అందుకున్న ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా (Aha)లో ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా (హీరోయిన్గా) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించాడు. సాయికుమార్, నరేశ్ వి.కె., కామ్నా జెఠ్మలానీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేశ్ దండా, శివ బొమ్మక్కు ఈ సినిమాను నిర్మించారు.
కథ
కుమార్ (కిరణ్ అబ్బవరం) పుట్టుకతోనే సంపన్నుడు. తండ్రి కృష్ణ (సాయికుమార్) అతి గారబంతో సర్వం సమకూర్చుతాడు. కానీ కుమార్ కి చదువు పట్టదు. పైగా ఎప్పుడూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. తనని దారిలో పెట్టాలని కేరళలోని ఓ కాలేజ్ లో చేర్చుతారు. అక్కడ మెర్సీ జాయ్ (యుక్తి తరేజా)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు కుమార్. అయితే మెర్సీకి ఓ మానసిక సమస్య వుంటుంది. ఆ సమస్య ఏమిటి? దానికి కారణంగా ఈ ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగిందనేది మిగతా కథ.
Get ready for the Burra Padu entertainer of the year
K Ramp premieres Nov 15 only on aha#KRampOnaha #BurrapaaduEntertainer @Kiran_Abbavaram @HasyaMovies @RajeshDanda_ @JainsNani pic.twitter.com/MAsZKzi4sV
— ahavideoin (@ahavideoIN) November 8, 2025