NIMZ Farmers | ఝరాసంగం, మే 20 : నిమ్జ్ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు, వ్యవసాయ కూలీలకు న్యాయం జరగాలని ఎల్గొయి గ్రామంలో ఇవాళ నిర్వహించిన రైతులు-కూలీల సమావేశంలో సీపీఎం డిమాండ్ చేసింది. ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి బి.రాంచందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూములు కోల్పోయిన ప్రతీ రైతుకు ఎకరానికి 120 గజాల ప్లాట్ ఇవ్వాలని, కూలీలకు కూడా పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరారు. భూముల మార్కెట్ ధరలు 40 నుండి 60 లక్షల రూపాయల వరకు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం 15 లక్షల రూపాయల మాత్రమే నష్టపరిహారం ఇవ్వడం దారుణమని ఆయన విమర్శించారు.
రిజిస్ట్రేషన్ విలువలు నిజమైన (బహిరంగ) మార్కెట్ ధరలకి ఎలా సమానం అవుతాయి ? అని ప్రశ్నించారు. మార్కెట్ ధరల ప్రకారమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, మార్కెట్ ధరపై మూడు రెట్లు చెల్లించాలన్నదే 2013 చట్టం ఉద్దేశమని గుర్తు చేశారు. భూముల రేట్లను సవరించకుండానే నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ