Cows | హత్నూర, ఏప్రిల్17 : విషాహారం తిని మూడు పాడి ఆవులు మృతి చెందిన ఘటన హత్నూర మండలం గుండ్లమాచునూర్లో ఇవాళ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మన్నె సత్తయ్య పాడి ఆవులు పెంచుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారి మాదిరిగా ఇవాళ గ్రామశివారులో పశువులను మేతకు తీసుకెళ్లాడు.
చెరువు సమీపంలో పోచమ్మ ఆలయం వద్ద గతవారం రోజుల క్రితం ఓ సినీ పరిశ్రమ షూటింగ్ నిర్వహించి అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు అన్నంతో రతిపోసే సన్నివేశాన్ని చిత్రీకరించారు. అనంతరం ఆ అన్నాన్ని అక్కడే వదిలి వెళ్లిపోవడంతో వారం రోజులుగా నిల్వ వున్న అన్నం కుల్లిపోయివుండగా.. పాడి పశువులు అన్నాన్ని తిన్నట్లు బాధితుడు తెలిపారు.
ఇవాళ తెల్లవారు జామున చూసేసరికి మూడు పాడి ఆవులు మృతిచెందగా.. మరో రెండు అస్వస్థతకు గురైనట్లు తెలిపాడు. దీంతో అస్వస్థతకు గురైన పశువులకు వెటర్నరీ సిబ్బంది చికిత్స చేసినట్లు తెలిపాడు. కాగా మృతిచెందిన పాడి ఆవులు రూ.3 లక్షల విలువ ఉంటుందని.. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరాడు. అదేవిధంగా పాడి ఆవుల మృతికి కారణమైన సినీ పరిశ్రమ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత