Indiramma Sarees | మునిపల్లి, నవంబర్ 24 : ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ బడులను సైతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారుస్తున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బోడపల్లి, పెద్ద గోపులారం, బుదేరా ప్రభుత్వ పాఠశాలల్లో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉపాధ్యాయులు ఓ వైపు పాఠాలు బోధిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మరోవైపు ఇందిరమ్మ చీరల పంపిణీ చేయడం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసింది.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ.. బోడపల్లి, పెద్ద గోపులారం, బుధేరా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల వద్ద చీరల పంపిణీ చేయడం సరైనది కాదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పాఠశాలల ముందు పంపిణీ చేస్తుంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా..? అంటూ అధికారుల తీరుపై గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏం కాదు సార్ అంటూ చీరలు పంపిణీ
పాఠశాలల ముందు చీరల పంపిణీ కార్యక్రమంపై బోడపల్లి ప్రధానోపాధ్యాయులు వెంకటేశంను వివరణ కోరగా.. నేను వద్దని చెబుతున్న పంచాయతీ కార్యదర్శి ఏం కాదు సార్.. అంటూ చీరలు పంపిణీ చేశారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పెద్దగోపులారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్‌ను వివరణ కోరగా.. నేను సెలవులో ఉన్న నాకు సమాచారం లేదని చెప్పారు. బుధేరా ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం (MEO) భీమ్ సింగ్‌ను వివరణ కోరగా నాకేం తెలువదని పొంతన లేని సమాధానం ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వారి వారి పాఠశాలలో ఏం జరుగుతుందో తెల్వకుండానే నిత్యం విధులు నిర్వహిస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు గ్రామాల్లోని మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసినట్లు మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో చీరల పంపిణీ చేసిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Indiramma Sarees 2

Rathotsavam | తిరుచానూరులో వైభవంగా రథోత్సవం..శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
Lakshmi Mittal | పన్నుల సెగ.. బ్రిటన్‌కు స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ గుడ్‌బై..?
BR Gavai: బెంజ్ కారును వదిలి వెళ్లిన మాజీ సీజేఐ గవాయ్..