Congress Leader | బీఫామ్ ఇవ్వలేదని రోడ్డెక్కి కాంగ్రెస్ మహిళా నేత ఆందోళన
congress leader | ఇటీవలే మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితాలో జిన్నారం మున్సిపాలిటీలోని నాలుగో వార్డుజనరల్ మహిళకు కేటాయించడంతో తనకు బీఫారం లభిస్తుందని మహిళా కాంగ్రెస్ నాయకురాలు నీలం లత ఆశించింది.
Congress Leader | జిన్నారం, జనవరి 03 : కాంగ్రెస్ పార్టీ తనకు బీ ఫామ్ ఇవ్వలేదని ఓ మహిళా కాంగ్రెస్ నాయకురాలు రోడ్డెక్కింది. తనకు కాంగ్రెస్ పార్టీ భీ ఫాం ఇవ్వకపోవడంతో ఆందోళన చేపట్టింది. ఈ ఘటన మున్సిపల్ కేంద్రమైన జిన్నారంలో చోటుచేసుకుంది.
జిన్నారం మున్సిపాలిటీలోని నాలుగో వార్డుకు చెందిన కాంగ్రెస్ మహిళ నేత నీలం లత గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవలే కేటాయించిన మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితాలో నాలుగో వార్డ్ జనరల్ మహిళకు కేటాయించడంతో తనకు బీఫారం లభిస్తుందని నీలం లత ఆశించింది.
కానీ కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా నీలం లతకు కాకుండా పుట్టి విజయలక్ష్మికి బీఫామ్ కేటాయించింది. దీంతో నీలం లత ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిన్నారంలో నామినేషన్ దాఖలు చేస్తున్న కేంద్రం వద్ద ఆందోళనకు దిగింది.
ఈ సందర్భంగా నీలం లత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు చోటు దక్కకపోవడం సరైనది కాదన్నారు. జిన్నారంకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు వడ్డే కృష్ణ, శ్రీకాంత్ రెడ్డిలు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదన్నారు.
Read Also :
Jagthyal | జగిత్యాల మున్సిపల్ పోరులో జీవన్ రెడ్డి vs సంజయ్
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

