Sircilla | సిరిసిల్లలో బీఫాం ఇవ్వమంటే డబ్బులు అడిగారు.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపిపై కౌన్సిలర్ అభ్యర్థి నాగరాజు గౌడ్
బీజేపీలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంచాయితీ రోడ్డుకెక్కింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగరాజు గౌడ్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం నిరసన తెలిపారు.
- కండువాలు నేలపై పడేసి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
Sircilla | సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 3 : బీజేపీలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంచాయితీ రోడ్డుకెక్కింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగరాజు గౌడ్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం నిరసన తెలిపారు. ఎనమిదేళ్లుగా పార్టీలో కష్టపడుతున్న తనకు మున్సిపల్ ఎన్నికల పోటీ చేసేందుకు బీ ఫామ్ ఇవ్వమంటే జిల్లా అధ్యక్షుడు గోపి డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపించారు.
బీజేపీలో జిల్లా అధ్యక్షుడు చేస్తున్న అరాచకాలు అధిష్టానానికి తెలియకుండానే జరుగుతున్నాయని ప్రశ్నించారు. గత మున్సిపల్ ఎన్నికలలో భారీ ఓట్లతో గెలిచిన తనకు బీజేపీలో కనీసం గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో ఎనిమిది ఓట్లు రాణి అభ్యర్థికి డబ్బులు తీసుకొని బీఫాం ఇచ్చారని ఆరోపించారు. పార్టీ కండువాలు నేలపై పడేసి అంబేద్కర్ విగ్రహానికి రాజీనామా పత్రం సమర్పించారు. ఆయన వెంట పదో వార్డు యువకులు తదితరులున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

