CMRF | హత్నూర, జూన్ 21 : సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. శనివారం హత్నూర మండలం సిరిపురం గ్రామానికి చెందిన దేవసత్ మంజులకు శస్త్ర చికిత్స నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1,50,000 ఎల్వోసి లెటర్‌ను బాధిత కుటుంబీకులకు అందజేశారు. అదేవిధంగా సికింద్లపూర్ గ్రామానికి చెందిన మాయిని వీరమనికి రూ. 21,000, దానాంపల్లి విజ్ఞతకు రూ. 19,500, మంగలి ధనలక్ష్మికి రూ.16,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కావడంతో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలు అనారోగ్యానికి గురై ప్రైవేటు దవాఖానల్లో చికిత్సపొంది ఆర్థిక సాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయడంతో ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు నరేందర్, పాండు గౌడ్, శ్రీకాంత్, వీరేందర్, యాదగిరి, శ్రీశైలం, కుమార్, యాదయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్