Adivasi day | నిజాంపేట్, ఆగస్టు 9 : మినీ గురుకుల పాఠశాలలో ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని బాచుపల్లి గ్రామంలోని మినీ గురుకులంలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి.. ఆయన సేవలను స్మరించుకున్నారు.
మినీ గురుకుల పాఠశాల విద్యార్థి విద్యార్థినులకు గిరిజనుల దుస్తులు ధరించి ఆటపాటలతో అంగరంగ వైభవంగా ఆదివాసుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలోని చిన్నారులంతా గిరిజనుల వేషధారణలో ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులుతోపాటు పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Shivraj Singh Chouhan: చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి శివరాజ్.. వీడియో