HomeHealthAmazing Health Benefits From Green Tomatoes They Keep These Diseases Away
Green Tomato Benefits | ఆకుపచ్చని టమాటలతో ఎన్ని లాభాలో తెలుసా..? ఈ వ్యాధులన్నింటిని తరిమికొట్టొచ్చు..!
Green Tomato Benefits
2/16
Green Tomato Benefits | టమోట అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేవి ఎర్రగా నిగనిగలాడే ఎర్రటి టమోటాలే. కానీ, ఆకుపచ్చ టమోటలతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలామందికి తెలియదు.
3/16
ఎక్కువ మంది ఎర్రటి టమోటలనే తీసుకుంటారు. పచ్చని టమోటాల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఆరోగ్యానికి అవి వరంలాంటివే. ఆకుపచ్చ టమోటాలతో ఎన్ని లాభాలున్నాయో ఓసారి తెలుసుకుందాం రండి..!
4/16
ఆకుపచ్చ టమోటాల్లో విటమిన్-సీ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతాయి.
5/16
ఎవరైనా బరువు తగ్గాలని భావిస్తుంటే.. ఆహారంలో ఆకుపచ్చని టమోటలను చేర్చుకోవాలి. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దాంతో కడుపు నిండి.. ఆకలిని తగ్గిస్తుంది.
6/16
ఆకుపచ్చ టమోటాల్లో ఉండే పొటాషియం, ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
7/16
ఈ టమోటాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.
8/16
ఆకుపచ్చ టమోటాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సీ ఉంటాయి, ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. ముడతలు పడకుండా చూస్తూ.. ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
9/16
ఎముకలను బలంగా చేస్తుంది. ఆకుపచ్చ టమోటాలల్లో ఎముకలను బలోపేతం చేయడానికి అవసరమైన కాల్షియం, విటమిన్ కే ఉంటాయి. ఇది ఆస్టియోపోరోసిస్, ఎముకల బలహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
10/16
ఆకుపచ్చ టమోటాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
11/16
ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది మధుమేహ రోగులకు మంచిదే.
12/16
ఎర్రటి టమోటాలను నేరుగా తినవచ్చు. అనేక వంటకాల్లో వాటిని ఉపయోగించవచ్చు, కానీ ఆకుపచ్చ టమోటాలను ఎలా తినాలో చాలామందికి తెలియదు.
13/16
ఆకుపచ్చ టమాటలను సలాడ్‌గా తీసుకోవచ్చు.
14/16
ఆకుపచ్చని టమాటలతో చట్నీ తయారు చేసుకొని తినవచ్చు.
15/16
ఆకుపచ్చని టమాటలతో కూర కూడా వండుకొని తీసుకోవచ్చు.
16/16
మీకు ఇష్టమైతే సూప్.. లేదంటూ జ్యూస్ రూపంలోనైనా వీటిని తీసుకోవచ్చు.