భోపాల్: దేశవ్యాప్తంగా ఇవాళ రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్( Shivraj Singh Chouhan).. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఓ చెట్టుకు రాఖీ కట్టారు మంత్రి శివరాజ్. వృక్షాలు ఆక్సిజన్ అందిస్తాయని, పక్షులు..ఇతర జీవాలు కూడా చెట్లను జీవాధారంగా భావిస్తాయని ఆయన అన్నారు. చెట్టుకు రెండు రాఖీలు కట్టిన ఆయన.. హారతి కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొందరు మహిళలు, అమ్మాయిలు.. మంత్రి శివరాజ్‌కు రాఖీ కట్టారు. ఆ ఆడపడుచులను ఆయన ఆశీర్వదించారు.
#WATCH | Bhopal, Madhya Pradesh: Union Minister Shivraj Singh Chouhan celebrates #RakshaBandhan2025 in Bhopal pic.twitter.com/MvCQcfojea
— ANI (@ANI) August 9, 2025