Muharram | ఝరాసంగం, జూలై 7: తెలంగాణలో మొహర్రాన్ని పీర్ల పండుగగా హిందూ, ముస్లింలు కుల, మత భేదం లేకుండా కలిసి జరుపుకోవడం మత సామరస్యానికి ప్రతీకనీ ఇలాంటి ఉత్సవాల ద్వారా ఐక్యత, సోదరాభావం పెంపొందుతుందని ప్రతి పండుగ మన సంస్కృతిలో అద్భుతమైన విలువను కలిగి ఉందని సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పటేల్ అన్నారు.
సోమవారం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో నిర్వహిస్తున్న మొహర్రం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై పీర్ల చావిడీల వద్ద పీర్లకు పూలు, దట్టిలు, కుడకలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు పూలమాల, శాలువాతో ఘనంగా ఆయనను సత్కరించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో సవారీలు ఊరేగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చుట్టూ పక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ వైభవాన్ని ఆస్వాదించారు.
ఈ కార్యక్రమంలో ఝరాసంగం సొసైటీ చైర్మన్ గౌస్మియా, మాజీ సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్, బీఆర్ఎస్ ఝరాసంగం పట్టణ అధ్యక్షులు ఇజాజ్ బాబా, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బాబుమియా, మాజీ ఎంపీటీసీ విజయేందర్ రెడ్డి, శుభాసరావు పటేల్, కిషోర్, నందు మహారాజ్, దయాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అశోక్, రాజు, వీరన్న, మాణయ్య, వివిధ గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు