MLA Manik Rao | జహీరాబాద్, ఏప్రిల్ 29 : రక్తదానం ప్రాణదానంతో సమానమని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. ఇవాళ రాష్ట్రీయ బసవ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ పటేల్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణం లోని బసవ మంటపంలో ఏర్పాటుచేసిన ఉచిత హెల్త్ క్యాంపు ,రక్త దాన శిబిర కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
క్యాంప్‌ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరికీ ముందస్తుగా బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. బసవ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం రక్త దానం చేయడం ఒక పుణ్యకార్యంగా భావించి రాష్ట్రీయ బసవ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం రక్త దానం చేసిన వారికి సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, ఝరాసంఘం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ శేరి , సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజీ పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షుడు బండి మోహన్, మహిళ నాయకురాలు పద్మజ, తులసి దాస్ ,సందీప్ రాజ్ , నగేష్ ,రాష్ట్రీయ బసవ దళ్ తెలంగాణ అధ్యక్షుడు శంకర్ పటేల్ ,రాష్ట్రీయ బసవ దళ్ నాయకుడు శర్నప్ప ,వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ సచిన్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి