Alcohol | మునిపల్లి, జులై 27 : గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 6.5 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ వినారెడ్డి తెలిపారు. ఆదివారం మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులో గల ముంబై జాతీయ రహదారిపై ఉన్న డెక్కన్ టోల్ ప్లాజా వద్ద ఉన్నతాధికారుల ఆదేశాల సంబంధిత ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ వినారెడ్డి మాట్లాడుతూ.. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేయగా.. ఓ ట్రావెల్స్ బస్సులో అక్రమ మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. 6.5 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేపట్టి వాహనాలు తనిఖీ చేసే క్రమంలో జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న బైకుపై ఇద్దరు వ్యక్తులు 1250 గ్రాముల ఎండు గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు.
గంజాయితోపాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి తరలిస్తున్న శ్రీధర్, జెహార అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ పట్టణంలోని మూసాపేట్ ప్రాంతానికి చెందిన వారిగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ యాదయ్య, హెడ్ కానిస్టేబుల్ అలీమ్, కానిస్టేబుల్స్ యాదయ్య, మల్కయ్య, కరీం, ప్రహ్లాద రెడ్డి, ఉమాలు ఉన్నారు.
Nallagonda | నల్లగొండ జిల్లాలో దారుణం.. బిడ్డను బస్టాండ్లో వదిలి వెళ్లిన తల్లి
KTR | ఎరువులు ఇవ్వలేని ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
Snake in Temple | ఆలయంలో పాము కలకలం.. భయంతో హడలిపోయిన భక్తులు.. Video