Suicide Attempt | సంగారెడ్డి : తన డబ్బు పోయిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఓ బాధితుడు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
గురుస్వామి అనే వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో నుంచి రూ.70 వేలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశానని.. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్లో పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడంతో అక్కడే ఉన్నవాళ్లు అడ్డుకున్నారు. సమాచారమందుకున్న పోలీసులు గురుస్వామిని విచారణలో భాగంగా గుమ్మడిదల పీఎస్కు తీసుకువెళ్లినట్టు సమాచారం.
ముందు కాంగ్రెస్ స్కాంలపై విచారణ జరిపించాలి.. బాలరాజు యాదవ్ డిమాండ్
Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు: వద్దిరాజు రవిచంద్ర
కేసులకు భయపడితే బీఆర్ఎస్ పార్టీ ఉండేదే కాదు: టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రానంద్