ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రలను తెలంగాణ రాష్ట్రమంతా చూస్తోందని తెలిపారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సుమిత్రానంద్ మీడియాతో మాట్లాడుతూ.. కేసులకు భయపడితే బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు కేసులు కొత్త కాదని తెలిపారు. కేసుల పేరుతో విచారణకు పిలవడానికే సరిపోయిందని అన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. విచారణల పేరుతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావుకు ఇప్పటికే సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అవినీతిని బయటపెట్టినందుకే కుట్ర పూరితంగా హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చారని విమర్శించారు.