Robbery | నర్సాపూర్, అక్టోబర్ 8: కారులో లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఇద్దరి వ్యక్తుల నుండి నగదు కాజేసిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రంజితకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట్ జిల్లా దామరిగిద్ద గ్రామం, మండలంకు చెందిన రెనివట్ల నర్సింహా అనే వ్యక్తి గొర్రెలను మేపుకుంటూ మంగళవారం సాయంత్రం 8 గంటల సమయంలో నర్సాపూర్ పట్టణ శివారులోని ఓ రైస్ మిల్ దగ్గరకు వచ్చి వాటిని అక్కడ ఉంచడం జరిగింది.
గొర్రెలకు మందులు తీసుకురావడానికని నర్సింహా తన మామ బజారే రామప్పతో కలిసి గురువారం ఉదయం 3 గంటల సమయంలో నర్సాపూర్ చౌరస్తా వద్ద నిలబడి ఉండగా సంగారెడ్డి వైపు నుండి బ్లూ కలర్ కారు వచ్చింది. వారిద్దరు ఆ కారును ఆపారు. ఆ కారులో నుండి ఓ వ్యక్తి ఎక్కడికి వెళ్లాలి అని అడగగా.. మెదక్ వెళ్లాలి అని చెప్పడంతో కిరాయి రూ.100 అవుతుందని కారులో ఉన్న వ్యక్తి అన్నారు. దీంతో సరే అని నర్సింహా, బజారే రామప్పద కారులో కూర్చున్నారు. అలా కారులో వెలుతుండగా కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు చంపుతామని బెదిరించి వారి దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలని వారిని కొట్టడం ప్రారంభించారు.
మేకల కొండయ్య నుండి కూడా..
మెదక్ రోడ్డులోని కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామం దాటిన తరువాత కారును రోడ్డు పక్కన ఆపి ఇద్దరి వద్ద గల ఫోన్లు లాక్కొని చేతులతో కొడుతూ చంపుతామని బెదిరించడంతో పాస్వర్డ్ చెప్పగా.. వారు నర్సింహా ఫోన్ నుండి రూ. 1000, జేబులో నుండి రూ.500 బలవంతంగా లాక్కున్నారు. అలాగే రామప్ప ఫోన్ నుండి రూ.4500, జేబులో నుండి రూ.1000 నగదు బలవంతంగా తీసుకున్నారు. వీరితోపాటు సంగారెడ్డి ఆందోల్ మండలం కుమ్మరి గూడెం గ్రామానికి చెందిన మేకల కొండయ్య నుండి కూడా సంగారెడ్డి మార్గంలో రూ.350 నగదు, వివో ఫొన్, పర్సు బలవంతంగా ఎత్తుకెళ్ళడం జరిగిందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అట్టి వ్యక్తులను చూస్తే గుర్తుపడతామని, మమ్మల్ని కొట్టి నగదు ఎత్తుకెళ్లిన ముగ్గురి వ్యక్తులపై తగు చట్టరీత్యా తగిన చర్య తీసుకోవాలని బాధితుడు నర్సింహా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింగం వెల్లడించారు.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్