Revenue Conference | రామాయంపేట, జూన్ 01 : ఈ నెల 3 నుండి జరిగే రెవెన్యూ సదస్సులను ప్రతీ గ్రామంలో రైతులు విజయవంతం చేయాలని రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు. ఆదివారం తన కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల డాటాను విడుదల చేసి సిబ్బందికి సూచనలు చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సమావేశాలు ఉంటాయన్నారు. భూభారతికి సంబంధించిన అంశాలను రెవెన్యూ సదస్సులో రైతులు తెలుపాలన్నారు.
ఈ నెల 3న తొనిగండ్ల, 4న లక్ష్మాపూర్, 5న ఝాన్సిలింగాపూర్, సదాశివనగర్, 6న సుతారిపల్లి, శివ్వాయపల్లి, 9న కోమటిపల్లి, 10న అక్కన్నపేట, 11న డి ధర్మారం, 12న కోనాపూర్, 13న దామరచెర్వు, 16న దంతెపల్లి, 17న పర్వతాపూర్, 18న కాట్రియాల, 19న రాయిలాపూర్, 20న రామాయంపేటలలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. ఈ సదస్సులలో రైతులకు సంబంధించిన భూ భారతి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!