హైదరాబాద్, మార్చి1 (నమస్తే తెలంగాణ): ప్రోగ్రెసివ్ మాడల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (పీఎంటీఏ – టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడిగా తరాల జగదీశ్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆయనే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించగా, ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తిరిగి ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అప్పాల అశోక్, మహిళా విభాగం కార్యదర్శిగా విఠలాని శీతల్, కన్వీనర్‌గా లావణ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సయ్యద్ సలీం, రాష్ట్ర కన్వీనర్‌గా అనుముల పోచయ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా స్వామి, కోశాధికారిగా గుంటోజు నవీన్‌కుమార్‌ను నియమించారు.