వాగుల ఉధృతి.. నిలిచిన రాకపోకలు
కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులపైకి నీళ్లు చేరడం, కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
- కామారెడ్డి జిల్లాలో జోరువాన
- లింగంపేట వాగులో ఒకరు గల్లంతు
ఎల్లారెడ్డి (లింగారెడ్డి), ఆగస్టు 4: కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులపైకి నీళ్లు చేరడం, కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లింగంపేట, గాంధారి మండలాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా లింగంపేట పెద్దవాగు ఉధృతంగా ప్రవహించడంతో పోచారం ప్రాజెక్టు రాత్రికి రాత్రే నిండి పోయింది. లింగంపేట పెద్ద వాగులో ఒకరు గల్లంతయ్యారు. పల్వంచ వాగు నిండుగా ప్రవహించగా, బాన్సువాడ మండలం అవాజ్పల్లి మత్తడి, కొల్లూరు వాగు, చెదల వాగులు పొంగిపొర్లాయి. బాన్సువాడ మండలం మొగులాన్పల్లి, కొయ్యగుట్ట, బోర్లం, ఇబ్రహీంపేట్, తిర్మలాపూర్ గ్రామ శివారులోని పొలాలు నీట మునిగాయి. దుంకుడు మోరి తండాలో వరద ఇండ్లలోకి రావడంతో గ్రామస్తులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. కామారెడ్డి- ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలోని లింగంపల్లి సమీపంలోని పాముల వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

