ధర్మారం, సెప్టెంబర్ 15 : మానసిక స్థితి సరిగాలేని పదిహేడేళ్ల బాలికపై లైంగికదాడి ఘటన పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ధర్మారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతున్నది. గ్రామానికి ఓ వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. పాఠశాలకు గైర్హాజరు కావడంతో ఉపాధ్యాయులు బాలిక ఇంటికి వెళ్లారు.
తండ్రి బడికి ఎందుకు వెళ్లడం లేదని కూతురును ప్రశ్నించడంతో.. సదరు వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిపింది. ఈ విషయాన్ని గ్రామంలోని కులపెద్దలకు బాధితురాలు తండ్రి చెప్పడంతో పెద్దమనుషుల సమక్షంలో నిందితుడు తప్పు ఒప్పుకొని బాధితురాలి తండ్రి కాళ్లు మొకి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ సమాచారం పోలీసులకు అందడంతో బాధితురాలి నుంచి వాంగ్మూ లం తీసుకున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, బాలికను వైద్యపరీక్షల కోసం దవాఖానకు తరలించారు.