హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. వాటిని కోయకముందే కన్నీళ్లు వస్తున్నాయి. వారం కిందట కిలో రూ.50 పలికిన ఉల్లి ధర ఇప్పుడు రూ.70 నుంచి రూ.80కి చేరింది. రెండు నెలల కిందట కేజీ ధర రూ.20 ఉండ మూడింతలు పెరిగింది. మలక్పేట వ్యవసాయ మారెట్లో క్వింటాల్ ఉల్లిగడ్డ ధర రూ.5,200- 5,500 దాకా పలుకుతున్నదని వ్యాపారులు చెబుతున్నారు. మారెట్కు మహారాష్ట్ర నుంచి మాత్రమే ఉల్లి వస్తున్నదని, రోజుకు 5,200-6,000 క్వింటాళ్ల అమ్మకం జరుగుతున్నదని పేరొంటున్నారు. మారెట్కు ఉల్లి తకువగా రావడంతో ధర పెరుగుతున్నదని చెప్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి తగ్గడం, డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్లే ధరలు పెరుగడానికి కారణమని తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ర్టానికి రెండు లక్షల ఇండ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గతంలో కేటాయించిన ఇండ్లకు వీటిని అదనంగా కేటాయించినట్టు తెలిపారు. ఏపీకి మూడు లక్షల ఇండ్లు కేటాయించామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.లక్షా75 వేలను కేంద్రం కేటాయిస్తున్నదని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ‘ఆవాస్ ప్లస్’ మొబైల్ యాప్ను వినియోగించనున్నట్టు మంత్రి వెల్లడించారు.