రాష్ట్రవ్యాప్తంగా ఇన్‌సర్వీస్‌లో ఉండి సోషల్‌వర్క్, సోషియాలజీ పూర్తి చేసిన నర్సింగ్ ఆఫీసర్లకు గ్రేడ్-1లో ప్రమోషన్లు ఇవ్వాలని క్రైస్తవ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసారం ప్రేమ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం రాష్ట్ర వైద్యరోగ్యశాఖ మంత్రి దామోదర నర్సింహాతోపాటు హైల్త్ కమిషనర్, డీహెచ్వోకు లేఖ రాశారు. ప్రమోషన్లు లేక అర్హులైన నర్సింగ్ ఆఫీసర్లు ఉద్యోగపరంగా నష్టపోతున్నారని లేఖలో ప్రస్తావించారు.