మాస్కో: ఆర్కిటిక్ సముద్ర మార్గానికి సంబంధించిన నార్తర్న్ సీ రూట్(ఎన్ఎస్ఆర్) రూటుపై భారత్ ఆసక్తిగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. భారత ఆర్ధిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రస్తుతం పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో తమతో వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు భారత్ ఆసక్తిగా ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఆర్కిటిక్ సముద్ర మార్గంలో షిప్పింగ్ కోసం చైనా, ఇండియా లాంటి దేశాలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈశాన రష్యా భాగంలో జరుగుతున్న సైనిక విన్యాసాలను వీక్షించేందుకు జపాన్ సమీపంలో ఉన్న దీవులకు పుతిన్ వెళ్లారు. ఆర్కిటిక్ రీజియన్స్ ఫోరమ్‌లో భారత్ కీలక భాగస్వామి అన్నారు. చెన్నై నుంచి వ్లాదివోస్తోక్ కారిడార్‌ను .. ఎన్ఎస్ఆర్ రూట్లో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. చెన్నై-వ్లాదివోసతోక్ కారిడార్ సుమారు 10,380 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తూర్పు ఆసియా, యూరోప్ మధ్య షార్టెస్ట్ షిప్పింగ్ రూట్‌గా ఎన్ఎస్ఆర్ను భావిస్తున్నారు.
ఎన్ఎస్ఆర్ మార్గం ద్వారా భారత్ వ్యూహాత్మకంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నట్లు రష్యా అంచనా వేస్తున్నది. చైనాను ఎదుర్కొనేందుకు భారత్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు చైనాపై రష్యా ఆధారపడుతోంది, కానీ ఇండియా-చైనా మధ్య ఇటీవల రిలేషన్ దెబ్బతిన్నది. మరో వైపు చైనాపైనే పాకిస్థాన్ కూడా ఆధారపడుతోంది. ఇటీవల చైనా, పాక్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా ప్రతిపాదిత ఎన్ఎస్ఆర్ సముద్ర మార్గానికి ఇండియా మద్దతు ఇవ్వాల్సి వస్తున్నది. అమెరికా హెచ్చరికలను పక్కనపెట్టి రష్యా వద్దే భారత్ ఇంధనం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, భారత్ మధ్య వైరుధ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ప్రతిపాదిత వాణిజ్య మార్గం కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి.
చెన్నై=వ్లాదివోస్తోక్ మార్గం ద్వారా ప్రయాణిస్తే 12 రోజుల్లో 5647 నాటికల్ మైళ్లను చేరుకోవచ్చు. సీ ఆఫ్ జపాన్, ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ, మలాకా జలసంధి మార్గంలో నౌకలు వెళ్తాయి. అయితే గతంలో ముంబై నుంచి పీటర్స్బర్గ్ మధ్య సముద్రం మార్గం ఉండేది. ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం, బాల్టిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తు సుమారు 8675 నాటికల్ మైళ్ల దూరాన్ని దాటేందుకు 32 రోజుల సమయం పడుతుంది. అయితే ప్రతిపాదిత ఎన్ఎస్ఆర్ మార్గం వల్ల చాలా సమయం ఆదా అవుతుందని భారత్ భావిస్తున్నట్లు పుతిన్ తెలిపారు.
India one of the key countries showing growing interest in cooperation on Northern Sea Route: Putin
Putin warns of rising artificial tensions in the Arctic as interest in the Northern Sea Route grows, while stressing that cooperation remains within international maritime law. pic.twitter.com/Yrx0LllhZb
— Sputnik India (@Sputnik_India) August 12, 2026