Housefull 5 Two Climaxes | బాలీవుడ్ కామెడీ ఫ్రాంచైజీ సిరీస్‌లో భాగంగా వస్తున్న ‘హౌస్‌ఫుల్ 5’ ఒక కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. సాధారణంగా ఏ సినిమాకు అయిన ఒకే క్లైమాక్స్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా మాత్రం రెండు వేర్వేరు క్లైమాక్స్‌లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. హౌస్‌ఫుల్ 5A, హౌస్‌ఫుల్ 5B (Housefull 5A, Housefull 5B) అనే రెండు వెర్షన్లలో సినిమా విడుదల కానుంది. ఈ రెండు వెర్షన్లలో కేవలం క్లైమాక్స్‌లు మాత్రమే కాదు, ‘కిల్లర్స్’ (సినిమాలోని విలన్ పాత్రలు) కూడా భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది.
సాజిద్ నదియాద్వాలా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కామెడీ ఎంటర్టైనర్లో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితీష్ దేశ్‌ముఖ్, నానా పటేకర్ వంటి స్టార్ నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన “ఫుగ్డీ డ్యాన్స్” వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. జూన్ 6, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘హౌస్‌ఫుల్ 5’ ఈ వినూత్న ప్రయోగంతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.