Harish rao | మెదక్ జిల్లా పాపన్నపేట, ఘనపూర్ మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన 26 మంది నూతన సర్పంచులు ఈ రోజు హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావు నూతన సర్పంచులను శాలువాలతో సత్కరించి వారికి అభినందనలు తెలిపారు.
బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యానికి నిదర్శనం.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికలకు తెలంగాణ ప్రజలు ఓటుతోనే గట్టి గుణపాఠం చెప్పారు. డబ్బు సంచులతో ప్రలోభపెట్టాలని చూసినా, బెదిరింపులకు పాల్పడినా ప్రజలు మాత్రం గులాబీ జెండా వైపే నిలిచారు. నామినేషన్ల దశ నుంచే మన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారు. ఏకగ్రీవాల పేరుతో బెదిరించారు. అయినా సరే మన కార్యకర్తలు, నాయకులు గులాబీ జెండాను వదలలేదు. ఈ గెలుపు బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యానికి నిదర్శనం ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. పైగా కేసీఆర్ ఇస్తున్న పథకాలకు కోతలు పెట్టారు. ఈ మోసాన్ని ప్రజలందరూ గమనించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో మన అభ్యర్థులు, గిరిజన బిడ్డలు సర్పంచులుగా గెలవడం చాలా సంతోషకరమన్నారు.
ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోసం, బీఆర్ఎస్ పాలన కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. ప్రభుత్వం సహకరించకపోయినా.. మీరు ధైర్యంగా ఉండండి. మీ వెనుక పార్టీ ఉంది, కేసీఆర్ ఉన్నారు. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి నిధులు సాధించుకుందాం. మీరంతా మీ గ్రామాల అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేయండని హరీష్ రావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, సీనియర్ నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Actor Pragathi | నా పూజల వలనే మెడల్స్ గెలిచింది.. నటి ప్రగతి పతకాలపై వేణు స్వామి కామెంట్స్
Akhanda 2 | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘అఖండ 2’.. బాలయ్య మాస్ తుపానుకి తొలి రోజు ఫుల్ కలెక్షన్స్
Lionel Messi | ఒకచోట ఇద్దరు దిగ్గజాలు.. మెస్సీని కలిసిన షారుఖ్ ఖాన్.. వీడియో