సెలబ్రిటీల జాతకాలతో నిత్యం వార్తల్లో ఉండే జ్యోతిష్యుడు వేణు స్వామి మళ్లీ సంచలనం సృష్టించారు. జాతకాలు చెప్పనని కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన ఆయన తాజాగా నటి ప్రగతి సాధించిన విజయాల వెనుక ఉన్నది తన పూజలే అని మళ్లీ నోరు జారాడు. టాలీవుడ్ నటి ప్రగతి ఇటీవల టర్కీలో జరిగిన ఆసియన్ ఓపెన్ & మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని, నాలుగు పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ అద్భుత విజయం సాధించినందుకు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెను అభినందించారు.
అయితే ప్రగతి తాను చేసిన పూజల వలనే గెలిచిందంటూ వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నటి ప్రగతి… వెయిట్ లిఫ్టింగ్‌లో గెలవాలని, విజయం సాధించాలని కోరుకుంటూ నా వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఆ పూజల కారణంగానే ఆమె ఈ పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ఏకంగా నాలుగు పతకాలను సాధించగలిగారు అని వేణు స్వామి తెలిపాడు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా పంచుకున్నాడు.
నటి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించిన నాలుగు మెడల్స్ తాను చేసిన ప్రత్యేక పూజలు కారణంగా వచ్చాయి
– వేణు స్వామి #Venuswamy #Pragathi #UANow pic.twitter.com/COsUMRCxot
— UttarandhraNow (@UttarandhraNow) December 13, 2025