Lionel Messi | ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన GOAT ఇండియా టూర్ 2025ను కోల్‌కతాలో ఘనంగా ప్రారంభించారు. ఈ చారిత్రక పర్యటనలో భాగంగా, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మెస్సీని మర్యాదపూర్వకంగా కలవడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. కోల్‌కతాలోని సుప్రసిద్ధ వివేకానంద యువ భారతి క్రిరంగన్ (సాల్ట్ లేక్ స్టేడియం)లో జరిగిన భారీ ఈవెంట్లో మెస్సీ, షారుఖ్ ఖాన్ ఒకే వేదికపైకి వచ్చి సందడి చేశారు. భారత సినిమా దిగ్గజం, ఫుట్‌బాల్ GOAT ఒకే చోట కలుసుకోవడంతో అభిమానుల ఆనందం పతాక స్థాయికి చేరింది.
ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెస్సీ గౌరవార్థం ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కూడా వర్చువల్‌గా ఆవిష్కరించారు. ప్రత్యేక ఆకర్షణగా షారుఖ్ ఖాన్ తన చిన్న కుమారుడు అబ్రమ్తో కలిసి ఈ కార్యక్రమానికి కోల్‌కతాకు చేరుకోవడం కనిపించింది. వేదికపై మెస్సీ, షారుఖ్ ఒకరినొకరు కలుసుకుని, ఆలింగనం చేసుకున్నారు. క్రీడా ప్రపంచం, సినీ ప్రపంచానికి చెందిన ఈ ఇద్దరు గ్లోబల్ ఐకాన్స్ ఒకే ఫ్రేమ్‌లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
మెస్సీ ఇండియా టూర్ షెడ్యూల్లో భాగంగా, కోల్‌కతాలో కార్యక్రమం పూర్తయిన వెంటనే సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. హైదరాబాద్‌లో రాత్రి 7 గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (ఉప్పల్)లో ఆయన ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొనబోతున్నాడు.
SHAH RUKH KHAN MEETS MESSI – VIDEO OF THE DAY. ❤️
– King of Indian Cinema & GOAT of Football. [PTI] pic.twitter.com/tQ3dCeGSOh
— Johns. (@CricCrazyJohns) December 13, 2025