Goa Thar Crash | గోవాలో కార్‌ను ఢీకొన్న థార్.. వృద్ధుడి మృతి.. డ్రైవర్ స్వాపింగ్ జరిగిందా..?
Goa Thar Crash : గోవాలో ఒక థార్.. ఎదురుగా వస్తున్న హ్యూండాయ్ ఐ20ని గత సోమవారం ఢీకొంది. ఈ ఘటనలో ఒక వృద్ధుడు మరణించగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మరో చిన్నారి కూడా గాయపడింది.
Goa Thar Crash : గోవాలో ఒక థార్.. ఎదురుగా వస్తున్న హ్యూండాయ్ ఐ20ని గత సోమవారం ఢీకొంది. ఈ ఘటనలో ఒక వృద్ధుడు మరణించగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మరో చిన్నారి కూడా గాయపడింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఒక అంశం వివాదంగా మారింది. డ్రైవింగ్ చేసిన అమ్మాయి స్థానంలో మరో యువకుడు తానే డ్రైవ్ చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఈ ఘటనలో డ్రైవర్ స్వాపింగ్ జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
డ్రైవింగ్ చేసిన అమ్మాయిని కాపాడేందుకు యువకుడు ఈ పని చేసి ఉండొచ్చని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలో డ్రైవింగ్ చేసినట్లుగా చెబుతున్న 19 ఏళ్ల శౌర్య గోయల్‌ను పోలీసులు అరెస్టు చేయగా, గంటలోపే బెయిల్‌పై బయటకు వచ్చేశాడు. గత సోమవారం గోవాలో నలుగురు యువతులు, ఒక యువకుడు కలిసి ఒక థార్ వాహనాన్ని రెంట్ తీసుకున్నారు. ఈ థార్‌ను ఒక అమ్మాయి డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడపడం వల్ల ఎదురుగా వస్తున్న ఒక కారును ఢీకొంది. ఈ ఘటనలో ఒక వృద్ధుడు మరణించగా, మహిళ, మరో చిన్నారి గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఒక యువతి వాహనాన్ని నడిపింది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే ఆమె స్థానంలో వేరే యువకుడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు.
దీంతో యువతిని కాపాడేందుకు ఆ యువకుడు డ్రైవర్ సీట్ స్వాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక పోలీసులు కూడా కేసులో ప్రధాన నిందితుడిగా డ్రైవింగ్ చేసినట్లుగా శౌర్య గోయల్ పేరు పేర్కొన్నారు. అతడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేయగా, గంటలోపే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసులో ఉన్న థార్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా.. యువతి థార్ నడిపిందన్న ఆరోపణల్ని పోలీసులు ఖండించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

