Poonam Kaur | మతమార్పిడి రాయబారి.. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పూనమ్ కౌర్ ఘాటు విమర్శలు?
Poonam Kaur | నటి పూనమ్ కౌర్ తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది. తన ట్వీట్లో ఆమె ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే ఈ పరోక్ష విమర్శలు చేశారని నెటిజన్లు మరియు రాజకీయ విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు
Poonam Kaur | నటి పూనమ్ కౌర్ తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది. తన ట్వీట్లో ఆమె ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే ఈ పరోక్ష విమర్శలు చేశారని నెటిజన్లు మరియు రాజకీయ విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలో తిరుమల లడ్డూ వివాదం మరియు సనాతన ధర్మంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సోషల్ మీడియా వేదికగా పూనమ్ స్పందిస్తూ.. కొందరు వ్యక్తులు కేవలం ప్రదర్శన కోసమే హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారని విమర్శించింది. బహిరంగ జీవితంలో హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నట్లు నటించి లబ్ధి పొందే వారు, తమ వ్యక్తిగత జీవితంలో మాత్రం పిల్లలకు మూడు నెలల వయసులోనే కాథలిక్ చర్చిలో బాప్టిజం ఇప్పించారని ఆమె ఆరోపించింది. అలాగే ఒకప్పుడు ఎంతో గొప్ప చరిత్ర కలిగిన కాపు సామాజిక వర్గ వారసత్వం ఇప్పుడు ఆర్థడాక్స్ కాథలిక్ క్రైస్తవంగా మారిపోయిందని.. ఇలాంటి వారు ‘మతమార్పిడి రాయబారు’ (Conversion Ambassador)లని ఘాటుగా అభివర్ణించింది.
మరోవైపు ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, వ్యక్తిగత జీవితాన్ని రాజకీయం చేయవద్దని మండిపడుతుండగా.. ఆమె విమర్శల్లో వాస్తవం ఉందంటూ కొందరు మద్దతు తెలుపుతున్నారు.
Some follow Hinduism only in costumes – the beneficiaries have baptised their children as young as 3 months old in a Catholic Church – we never were changing our legacy then – grand old legacy of kapu community changed to orthodox catholic Christianity- conversion ambassador.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) February 24, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

