Badibata Program | రామాయంపేట, మే 16 : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మంచి విద్యాబుద్దులు అలవడుతాయని.. అందు కోసం బడిబయట ఉన్న పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించేలా తల్లితండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సహకరించాలని రామాయంపేట మండల విద్యాధికారి (ఎంఈవో) అయిత శ్రీనివాస్ కోరారు.
ఇవాళ ఆయన రామాయంపేట మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బడిబాటను ప్రారంభించి.. తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. మండలంలో ప్రతీ గ్రామంలోని ప్రభుత్వ బడులలో ఉపాధ్యాయులు మంచి విద్యను అందిస్తున్నారని అన్నారు.
గ్రామాలలో, పట్టణాలలో బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ప్రభుత్వ బడిలోనైతే మంచి విద్యతోపాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఫీజుల్లేకుండా చదువు, సన్న బియ్యంతో అన్నం, స్కాలర్ షిప్లను కూడా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఎంఈవో మండల పరిధిలోని లక్ష్మాపూర్, ఝాన్సిలింగాపూర్, సుతారిపల్లి, డి.ధర్మారం, శివ్వాయపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి బడిబాటను ప్రారంభించారు.
Water tank | పాఠశాలలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్.. భయందోళనలలో విద్యార్థులు
Badibata program | నిజాంపేట మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం
Huge Donation | తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త గోయాంక భారీ విరాళం