హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి పోరాటపంథానే సరైన మార్గమని ఆర్టీసీ కార్మికులు ‘చలో సెక్రటేరియట్’కు సన్నద్ధమవుతున్నారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో డిపో నుంచి భారీ సంఖ్యలో కార్మికులు కదిలి వచ్చేందుకు ఆర్టీసీ కార్మిక జేఏసీ ఏర్పా ట్లు చేసింది.
కార్మికుల పోరాటం పెద్దఎత్తున కొనసాగనుందని అంచనా వేసిన ఉన్నతాధికారులు అన్ని డిపోలకు అనధికారిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో చలో సెక్రటేరియ ట్ పోస్టర్ల ఆవిష్కరణలో పాల్గొంటున్న కార్మికులు మొదలుకొని.. పోరాటానికి మద్దతిస్తు న్న కార్మికుల వివరాలు తీసుకుంటున్నట్టు స మాచారం. ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా కార్మికులు ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. కొన్ని డిపోల మేనేజర్ల వేధింపులు తట్టుకునేందుకు డ్యూటీలు చేసుకొనే కార్యక్రమానికి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని, వేతన సవరణ చేపట్టాలని, బకాయిలు విడుదల చేయాలని, కార్మిక సంఘాలను పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్లతో చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. దీంతో అన్ని కార్మిక సంఘాల నేత లు అన్ని డిపోలకు వెళ్లి పోస్టర్ల ఆవిష్కరణ, సమావేశాలు పెట్టి కార్మికులను చైతన్యం చేశారు. 24న చేపట్టే కార్యక్రమం సరికొత్త చరిత్ర లిఖించేలా కార్మికులు తరలిరావాలని కోరుతున్నారు.
కార్మికుల కోసం చేపట్టిన ఈ భారీ నిరసన కు సంఘాలకు అతీతంగా ఐకమత్యంతో కదలాలని డిపోలవారీగా కార్మికులు తీర్మానించుకుంటున్నారు. ఈ పోరాటం విజయవంతం కాకుండా అటు డిపో మేనేజర్లు, పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడ విధులు బహిష్కరించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. అడ్డుకోవాలని చూస్తే నడిరోడ్లపైనే బస్సులను నిలిపివేయాలన్న ఆవేదనతో ఉన్నట్టు సమాచారం. ప్రతి ఉద్యోగి ఆ రోజు ఏ కార్యక్రమాలు ఉన్నా వాయిదా వేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. ‘చలో సెక్రటేరియట్’ విజయవంతమైతే తామంతా ఐకమత్యంతో ఉన్నామనే సందేశం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుందని చెబుతున్నారు.
2001 నుంచి 2019 వరకు అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఆర్టీసీ కార్మికులది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయకపోగా, ప్రభుత్వం అపాయింటెడ్ డే ప్రకటించలేదు. వేతన సవరణ బకాయిలూ ఇవ్వలేదు. ఆర్టీసీ నెత్తిన ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చి పెడుతున్నారు. ఇలాగే చూస్తే ఆర్టీసీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. కార్మికులంతా వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. దీంతో ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుంది.
– ఎం థామస్‌రెడ్డి, ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్